అర్జున్ రెడ్డి భామకు బంపర్ ఆఫర్

86

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండేకి బాలీవుడ్ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ హీరోయిన్ అయిన ఈ అమ్మడికి టాలీవుడ్ పెద్దగా కలిసిరాలేదు. దింతో కొంత గ్యాప్ తర్వాత ముంబై బాట పట్టింది.

అక్కడ బంఫాడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తర్వాత మూడు చిత్రాలను లైన్ లో పెట్టింది. వీటితో పాటు అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తెరంగేతరం చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా షాలినీ పాండే నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మేకర్స్ షాలినీ పాండేను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది.

మరి ఈ వార్తలపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. ఒక వేళ షాలినీకి ఈ అవకాశం వస్తే టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయ్యే అవకాశం లేకపోలేదు.

 

అర్జున్ రెడ్డి భామకు బంపర్ ఆఫర్