ఏపీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌.. ఛార్జీలో 10 శాతం డిస్కౌంట్

230

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. సూపర్‌లగ్జరీ, అల్ట్రా డీలక్స్, డాల్పిన్, అమరావతి, ఇంద్ర, ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ప్రయాణించడానికి 48 గంటల ముందు టిక్కెట్లను రిజర్వు చేసుకుంటే ఛార్జీలో 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఈ సౌకర్యం విజయవాడ, హైదరాబాదు, చెన్నై, విశాఖపట్టణం, బెంగళూరు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు మాత్రమే వర్తించనుంది. అదికూడా తొలి నాలుగైదు సీట్లకు మాత్రమే రాయితీ ఉంటుందని.. ఆర్టీసీ సంస్థ రీజినల్‌ మేనేజర్‌ జితేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. ఈ అవకాశం మార్చి 31వ తేది వరకు అమలులో ఉంటుందని ఆయన తెలియజేశారు.