నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని వెనక్కు పంపిన అధికారులు

163

ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు ఎంపీడీఓ కార్యాలయాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా హిందూపురం మండలం తూముకుంట ఎంపీడీఓ కార్యాలయానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన షమీన్ తాజ్ అనే అభ్యర్థిని వెనక్కి పంపారు అధికారులు. నామినేషన్ పత్రాలు రాలేదని అధికారులు తెలిపారు. దింతో నామినేషన్ వేసేందుకు వచ్చిన సదరు అభ్యర్థి వెనక్కు వెళ్ళింది.

ఇక మరి కొన్ని జిల్లాలో నామినేషన్లను స్వీకరిస్తున్నారు అధికారులు. హడావిడి లేకుండా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో నామినేషన్‌ పత్రాలు పంచాయతీ కార్యాలయాలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో నామినేషన్లు తీసుకునేందుకు అధికారులకు బాధ్యతలు కేటాయించారు. పరిస్థితి సరిగా లేకపోవడంతో నామినేషన్ దాఖలు చేసేందుకు ఒకరిద్దరు మాత్రమే వస్తున్నట్లు తెలుస్తుంది.

నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని వెనక్కు పంపిన అధికారులు