panchayat election : నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన వ్యక్తి.

163

ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఫిబ్రవరి రెండో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా మందకొడిగా నామినేషన్లు వేస్తున్నారు. ఇక మొదటి దశలో జరిగిన విధంగానే అక్కడక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు చోట్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. నామినేషన్ పత్రాలను చింపి వేస్తున్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా మదనపల్లే మండలంలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. సిటిఎం క్రాస్ మిట్టపల్లి పంచాయతీ` వార్డు మెంబర్ గా రమణమ్మ నామినేషన్ వేయడానికి వచ్చారు. అయితే ఓ వ్యక్తి ఆమె చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కొని వెళ్ళిపోయాడు. పత్రాలు తీసుకెళ్లిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన కిషోర్ అని పోలీసులు గుర్తించారు. పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

panchayat election : నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన వ్యక్తి.