ఆంధ్ర ప్రదేశ్ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్

67

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తరువులు జారీచేసింది. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని పదవి కాలం డిసెంబర్ 31 తో ముగుస్తుంది. ఈ మేరకు కొత్త సిఎస్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తరువులు జారీచేసింది. అటు సీఎస్ పదవి నుంచి తప్పుకుంటున్న నీలం సాహ్నికి సముచిత స్థానం కల్పించింది ప్రభుత్వం. సాహ్నిని సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సీఎస్ నియామకానికి సంబంధించి ఏడుగురు అధికారుల పేర్లు తెరపైకి వచ్చాయి. కాగా వీరిలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసులలో ఉండగా చంద్రబాబు హయాంలో సీఎస్ గా పనిచేసిన సతీష్ చంద్రను తిరిగి నియమించేందుకు సీఎం జగన్ సుముఖత చూపలేదు. ఇక మరో అధికారి నీరబ్ కుమార్ సర్వీస్ 2014 వరకు ఉంది. అప్పటివరకు సీఎస్ గా ఉంచలేమని జగన్ భావించినట్లు అర్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ రెడ్డి హయాంలో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ వైపు మొగ్గుచూపారు జగన్.

ఆంధ్ర ప్రదేశ్ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్