అన్నంత పని చేశాడు.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నిమ్మగడ్డ

362

రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో ఎన్నికలు నిర్వహించడం కమిషన్ విధి అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వస్తే తప్పనిసరిగా పాటిస్తామని తెలిపారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. గతంలో సుప్రీం నిర్ణయాన్ని వెంటనే అమలు చేశామని నిమ్మగడ్డ గుర్తుచేశారు.

ఇక మొదటివిడత పోలింగ్ ఫిబ్రవరి 5 ఉంటుంది. 11 జిల్లాలో తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్నారు .జనవరి 25 నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. జనవరి 27 తో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక ఫిబ్రవరి 5 ఉదయం 6:30 నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది 3 గంటలకు ముగుస్తుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలు కూడా ఫిబ్రవరి 5 నే వెలువడతాయి.