Ap High court : పాత ఓట‌ర్ల జాబితాతోనే ఏపీ పంచాయతీ ఎన్నిక‌లు

131

ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ మొదలైన విషయం విదితమే. ఇక ఈ ఎన్నికలు 2019 నాటి ఓటర్ల జాబితాతోనే నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త జాబితా తయారు చేసి ఎన్నికలు నిర్వహించాలని వేసిన రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఓటర్ జాబితాపై ఎస్ఈసీదే తుది నిర్ణయమని తేల్చేసింది. 2021 జాబితా ప్రకారం నిర్వహించేలా ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని రెండు పిటిషన్లు దాఖలు చేశారు.

అయితే దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పిటిషన్లను కొట్టేస్తూ పాత జాబితాలో జరపొచ్చని తీర్పు ఇచ్చింది. అటు కొత్త జాబితా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌ల అనంత‌రం ఈసీ నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అని.. ఎన్నికల ప్రక్రియలు జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. 2019 జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే 3 లక్షల 60 వేలమంది ఓటుకు దూరమవుతున్నారు. 2019 తర్వాత 18 ఏళ్ళు నిండిన వారంతా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోలేక పోతున్నారు. ఈ విధంగా జరగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తుంది.

Ap High court : పాత ఓట‌ర్ల జాబితాతోనే ఏపీ పంచాయతీ ఎన్నిక‌లు