ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరూప్ గోస్వామి నియామకం

101

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌ గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. దీనికి సంబంధించిన గెజిట్‌ను కేంద్రన్యాయశాఖ గురువారం విడుదల చేసింది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్న మహేశ్వరీని సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించాలని సూచించారు. ఏపీ హైకోర్టు సీజే నియామకానికి సంబంధించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించిన అనంతరం నిర్ణయించారు.

జస్టిస్‌ అరూప్‌ గోస్వామి 1961 అస్సాంలోని జోర్హాట్‌లో జన్మించారు. గువాహటి ప్రభుత్వ న్యాయకళాశాల నుండి 1985లో న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1985 ఆగస్టు 16న న్యాయవాదిగా తన పేరును నమోదు చేసుకున్నారు. గువహటి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 అక్టోబర్‌ 15న సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉద్యోగోన్నతి పొందారు. శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కొద్దీ ఏళ్లలో చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు అరూప్ గోస్వామి.

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరూప్ గోస్వామి నియామకం