అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఏపీ గవర్నర్ విరాళం

224

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ దంపతులు.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చారు.. శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన ఆరెస్సెస్, విశ్వహిందు పరిషద్ (విహెచ్ పి) ప్రతినిధులకు విరాళానికి సంబంధించిన చెక్కును గవర్నర్ దంపతులు అందజేశారు. ఈ సందర్బంగా విహెచ్ పి, ఆరెస్సెస్ ప్రతినిధులు గవర్నర్ ను సన్మానించి అయోధ్య రామాలయం నమూనా చిత్రపటాన్ని అందజేశారు. కాగా అన్ని రాష్ట్రాల్లో హిందుత్వ వాదులు, సంఘ్ కార్యకర్తలు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్నారు.