వలంటీర్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం

208

శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న తరువాత వలంటీర్‌ పిల్లా లలిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వలంటీర్‌ లలిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 50 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన పిల్లా లలితతో పాటు మరో 8 మంది వలంటీర్లు, వీఆర్వో ప్రసాద్‌ కు కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చారు. అయితే అప్పటినుంచి ఆమె అస్వస్థతకు గురయ్యారు.. తలనొప్పి, వాంతులు, విరోచనాలు రావడంతో ఆసుపత్రిలో చేరారు.. చివరకు ఈ ఆదివారం ఆమె మరణించారు.