ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

175

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సైన్యంలో సేవలు అందించిన వారికీ ఇచ్చే గ్యాలంట్రీ అవార్డకు ప్రస్తుతం అందిస్తున్న ఆర్ధిక సమయం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒకే సారి 10 రెంట్లు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు అశోకచక్ర పురస్కారానికి 10. లక్షల ఆర్థిక సాయం ఇచ్చే వారు. దానిని కోటి రూపాయలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మహావీరచక్ర, కీర్తిచక్ర పురస్కారాలకు రూ.8 లక్షల ఆర్ధిక సాయాన్ని రూ.80 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరచక్ర, శౌర్యచక్ర పురస్కారాలకు రూ.6లక్షల ఆర్ధిక సాయాన్ని రూ.60 లక్షలకు పెంచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు