ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు

87

ఆయుధాల కొనుగోలులో అక్రమాలకు సంబంధించి సస్పెన్షన్ కు గురైన 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. అల్ ఇండియా సర్వీస్‌ రూల్‌–8 కింద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. భద్రత పరికరాల కొనుగోలులో అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.10 లక్షల నష్టం వాటిల్లడం తోపాటు శాఖాపరమైన వ్యవహారాన్ని గోప్యంగా ఉంచలేదన్న అభియోగాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని..

లేదంటే చర్యలు తీసుకోవలసి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నోటీసులు ఇచ్చారు. కాగా ఆయుధాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని భావించిన ఏపీ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ విధించింది. అయితే దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్టే ఇచ్చింది. దాంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.. ఈ క్రమంలో ‘హైకోర్టు స్టే’ పై ‘స్టే’ విధించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది సుప్రీంకోర్టు.