ఎన్నికల విషయంలో స్వరం మార్చిన ఉద్యోగ సంఘాల నేతలు

136

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వేసిన ఎన్నికల వాయిదా పిటిషన్ ను కొట్టేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవడంతో ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఇక ఈ నేపథ్యంలోనే ఉద్యోగసంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తామెప్పుడు ఎన్నికల్లో పాల్గొనమని చెప్పలేదని మాటమార్చారు. ఆదివారం వరకు ఎన్నికల కమిషనర్ పై ఊగిపోయిన వెంకట్రామిరెడ్డి సుప్రీం కోర్టు తీర్పుతో చల్లబడ్డారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు.

కానీ ఆరోగ్య పరిష్టితి బాగాలేని వారిని విధులకు హాజరుకాలవని ఒత్తిడి చేయకూడని అన్నారు. నిన్నటివరకు తాము ఎన్నికల విధుల్లో పాల్గొనమని ముక్త కంఠంతో చెప్పిన వెంకట్రామిరెడ్డి సుప్రీం కోర్టు తీర్పుతో ఎన్నికల విధుల్లో పాల్గొంటామని తెలిపారు. తీర్పు నేపథ్యంలో సుప్రీం కోర్టు, ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగస్తులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. విధుల్లో ఎందుకు పాల్గొనరని ప్రశ్నించింది. దింతో ఉద్యోగసంఘాల మెత్తబడినట్లు తెలుస్తుంది.

ఎన్నికల విషయంలో స్వరం మార్చిన ఉద్యోగ సంఘాల నేతలు