ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు : సుప్రీంకోర్టుకు ఉద్యోగ సంఘాలు..

140

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెకిసిందే.. అయితే ఈ విషయంలో ప్రభుత్వమే కాకుండా తాము కూడా సుప్రీంకోర్టుకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.

ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలని సుప్రీంకోర్టులో కోరనున్నట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని తెలిపాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు ఉందని జేఏసీ నేతలు చెబుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి తేల్చిచెప్పారు.. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.