ఎన్నికల విధుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర క్యాబినెట్ సీఎస్ కు నిమ్మగడ్డ లేఖ

157

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు సహకరించకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు. మొదట కలెక్టర్లతోనే ఎన్నికలు జరిపించాలనుకున్నామని కానీ కొంతమంది తాము విధుల్లో పాల్గొనమని చెప్పడంతో కేంద్ర సిబ్బందిని ఉపయోగించుకునేందుకు గాను కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉయోగులను ఎన్నికల విధుల్లో పాల్గొనేలా అనుమతి ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. మొదట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలే ఉపయోగించుకోవాలని చూశామని వారు సహకరించమని చెప్పడంతో చివరి ప్రయత్నంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు విధుల్లో పాల్గొనే విధంగా అనుమతివ్వాలని కోరారు.