ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణికి ముహూర్తం ఖరారు

81

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ భద్రపరిచారు. సిబ్బందికి వ్యాక్సిన్ ఎలా ఇవ్వాలి అనే దానిపై శిక్షణ ఇస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో డిసెంబర్ 25 న వ్యాక్సిన్ ఇవ్వడం మొదలు పెడతామని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 4,762 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అరగంట సేపు అబ్సర్వేషన్ లో పెడతారు. అనంతరం ఇళ్లకు పంపుతారు. మొత్తం కోటి మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో కోటిమందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు 8,76,336కు చేరాయి. మరణాలు 7 వేలు దాటాయి. రాష్ట్రంలో క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.

 

ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణికి ముహూర్తం ఖరారు