ఏపీలో కరోనాతో ముగ్గురు మృతి

71

ఏపీలో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి.. గత 24 గంటల్లో మొత్తం 57,716 శాంపిల్స్‌ ని పరీక్షించగా 379 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కారణంగా చిత్తూర్‌, కడప, కృష్ణ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.. గడచిన 24 గంటల్లో 490 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,76,823 పాజిటివ్ కేసులకు గాను.. 8,65,874 మంది డిశ్చార్జ్ కాగా.. 7,085 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,864 గా ఉంది.