ఏపీలో కొత్తగా 479 కరోనా కేసులు

62

ఏపీలో గత 24 గంటల్లో 62,215 శాంపిల్స్‌ ని పరీక్షించగా 479 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ పేర్కొంది. అలాగే కరోనా కారణంగా చిత్తూర్‌, గుంటూరు, కృష్ణ మరియు పశ్చిమ గోదావరి లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు మరణించారు. అదేసమయంలో గడచిన 24 గంటల్లో 497 మంది కోవిడ్‌ నుండి పూర్తిగాకోలుకున్నారు.. ఇదిలావుంటే రాష్ట్రంలోని నమోదైన మొత్తం 8,75,390 పాజిటివ్ కేసులకు గాను.. 8,62,967 మంది డిశ్చార్జ్ కాగా.. 7,074 మంది మరణించారు.. ప్రస్తుతం 4,395 యాక్టీవ్ కేసులున్నాయి. ఇక శుక్రవారం సాయంత్రం వరకూ రాష్ట్రంలో 1,12,58,789 శాంపిల్స్ ని ఆరోగ్య సిబ్బంది పరీక్షించింది.