జలశక్తి మంత్రితో ముగిసిన సీఎం జగన్‌ భేటీ

82

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి , కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ల భేటీ ముగిసింది. పోలవరం ప్రాజెక్ట్‌ తోపాటు పునరావాసానికి కావలసిన నిధులు సత్వరమే విడుదల చేయాల్సిందిగా భేటీలో మంత్రిని కోరారు జగన్. మొత్తం పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం, 55,656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని సీఎం జగన్ కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. 44,574 కుటుంబాల నుంచి 1,06,006కు పెరిగినట్టు మంత్రికి వివరించారు. కాగా ఢిల్లీ పర్యటనలో నిన్న హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో కూడా సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మూడు రాజధానులు, పోలవరం అంశాలపై చర్చించారు.