ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల దుశ్చర్య

233

మావోలు తమ ఉనికిని చాటుకునేందుకు భద్రతా బలగాలపై దాడులకు తెగబడుతున్నారు. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న మన్యం బాంబుల మోతలతో అలజడి రేకెత్తించింది. భద్రతా బలగాలే లక్ష్యంగా ఏఓబీలో మావోలు దుశ్చర్యకు పాల్పడ్డారు. కుంబింగ్ కు వెళ్తున్న భద్రతా బలగాలను టార్గెట్ చేసుకొని మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ అధికారి ధర్మేంద్ర సాహుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే భద్రతా సిబ్బంది హెలికాప్టర్‎లో రాయపూర్ ఆస్పత్రికి తరలించారు. ఏవోబీలో మావోయిస్టులు ఇలాంటి ఎన్నో సంఘటనలకు పాల్పడ్డారు. మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చివేయడంతో భద్రతా బలగాలు మరింత అలర్ట్ అయ్యాయి. ఏఓబిలో గాలింపు ముమ్మరం చేశాయి. గత కొంత కాలంగా ప్రశాంతంగా మన్యంలో మందుపాతర పేలడం ఆందోళన కలిగిస్తుంది.

ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల దుశ్చర్య