గోదావరిలో స్వీటీ అనుష్క విహారయాత్ర

95
anushka-shetty-spotted-godavari-purushothapatnam
anushka-shetty-spotted-godavari-purushothapatnam

పచ్చిమగోదావరి జిల్లాలో స్వీటీ అనుష్క సందడి చేశారు. పురుషోత్తపట్నం వద్ద గోదావరి వద్ద కొద్దిసేపు గడిపారు. బెంగళూరులో ఏఎంసీ విద్యాసంస్థల అధినేత కల్లూరి రామకృష్ణ పరమహంస సతీమణి గీతా పరమహంస నాలుగు రోజుల క్రితం సినీనటి అనుష్కతో కలిసి తమ సొంత ఊరు పురుషోత్తపట్నంకు చేరుకున్నారు. ఈ సందర్బంగా గోదావరిలో బోటులో ప్రయాణించి నది అందాలను ఆస్వాదించారు. దీంతో చుట్టుపక్కల వారు అనుష్కను చూడటానికి పోటీ పడ్డారు. కాగా బుధవారం అనుష్క తదితరులు మరపడవపై దేవీపట్నం మండలం గండి పోశమ్మ అమ్మవారిని, పట్టిసీమ వీరభద్రుని దర్శించుకొని పూజలు నిర్వహించారు.