మధ్యప్రదేశ్ లో మతమార్పిడి నిరోధక చట్టం.. 23 కేసు నమోదు

247

పెరిగిపోతున్న మతపర్పిడిలను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మతమార్పిడి నిరోధక చట్టం తీసుకొచ్చింది. చట్టం తీసుకొచ్చిన నెల రోజుల్లోనే 23 కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా వెల్లడించారు. లవ్ జిహాద్ ను నిరోధించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. ఉత్తర ప్రదేశ్ కూడా మతమార్పిడి నిరోధ చట్టం తీసుకొచ్చిన విషయం విదితమే.. మోసపూరిత మార్గాల ద్వారా మత మార్పిడి తీవ్రమైన సమస్య అని, దీన్ని నివారించాల్సిన అవసరం ఉందని మిశ్రా చెప్పారు. భోపాల్ డివిజన్‌లో అత్యధికంగా ఏడు కేసులు నమోదైనాయని మిశ్రా వివరించారు. ఈ చట్టం కింద దోషిగా తేలితే 10 ఏళ్ళవరకు జైలు శిక్ష, భారీ జరిమానా ఉంటుంది.

మధ్యప్రదేశ్ లో మతమార్పిడి నిరోధక చట్టం.. 23 కేసు నమోదు