Another vaccine : కరోనాను తరిమేందుకు మరో టీకా

243

Another vaccine to eradicate the corona : దేశం ప్రపంచ మెడికల్ స్టోర్ గా మారింది. ఇప్పటికే కరోనా మహమ్మారిని తరిమేందుకు రెండు రకాల టీకాలను తయారు చేసి 90 కి పైగా దేశాలకు లాభాపేక్ష లేకుండా ఇచ్చేసింది. ఇక త్వరలో మరో టీకా రానుందని సీరం ఇనీటిట్యూట్ ప్రకటించింది. జూన్ వరకు ‘కొవొవాక్స్‌’ ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తునట్లుగా సీరం సిఈఓ అదర్ పూనావాలా శనివారం ట్విట్ చేశారు. నోవావాక్స్‌ సంస్థ అభివఅద్ధి చేసిన ‘కొవొవాక్స్‌’ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలనిస్తోంది.

దీనికి సంబంధించి ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి కోరారు. ట్రయల్స్ జూన్ వరకు పూర్తవుతాయని, అనంతరం వ్యాక్సిన్ మార్కెట్ లోకి తీసుకొస్తామని సీరం సీఈఓ తెలిపారు. కొవొవాక్స్‌ టీకాపై భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సీరం సిద్ధమైంది. దీనిని అమెరికాకు చెందిన నోవావాక్స్‌ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ టీకా సామర్థ్యం 95.6 శాతంగా తేలినట్లు సీరం సంస్థ గతంలో ప్రకటించింది. ఏప్రిల్‌ నుండి నెలకు 40-50 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది.

ఈ వ్యాక్సిన్ కొత్తగా వచ్చిన యూకే రకం వైరస్ ను కూడా అడ్డుకుంటుందని తెలిపారు. ఇక దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిరంతరాయంగా నడుస్తుంది. 13 రోజుల్లోనే 30 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేశారు. టీకా తీసుకున్న వారు ఒకరిద్దరు మిహన అందరు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ టీకా పంపిణీలో దూసుకుపోతుంది. ప్రతి రోజు సుమారు మూడు లక్షల మందికి టీకా ఇస్తున్నారు సిబ్బంది.

Another vaccine : కరోనాను తరిమేందుకు మరో టీకా