హీరోగా బ్రహ్మానందం మరో వారసుడు?

146

తెలుగు సినీ పరిశ్రమలో బ్రహ్మానందం పాత్ర గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు తరాలను అయన కామెడీతో నవ్వించి మెప్పించారు. హీరోలతో సమానంగా అభిమానులకు సొంతం చేసుకోవడంతో పాటు ఆయన తెర మీద కనిపిస్తే చాలు నవ్వులు పూయిస్తారనే నమ్మకాన్ని ఆయన సొంతం చేసుకోగలిగారు. ఆయన వర్ధమాన నటులకు ఓ మార్గదర్శక పుస్తకం కూడా. అయితే.. ఇప్పటికే ఆయన వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుమారుడు గౌతమ్ మాత్రం ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోయారు.

మూడు సినిమాలు చేసిన బ్రహ్మానందం పెద్ద కుమారుడు గౌతమ్ సక్సెస్ కాలేకపోగా ఇప్పుడు ఆయన మరో కుమారుడు సిద్దార్థ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ నడుస్తుంది. సిద్దార్థ్ చిన్న వయసులోనే చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్లడంతో ఇండస్ట్రీలో కూడా అతని గురించి తెలియలేదు. కానీ ఇప్పుడు చదువులు పూర్తిచేసుకొని హైదరాబాద్ దిగిపోవడంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అనే ఊహాగానాలు మొదలయ్యాయి. హీరో ఎంట్రీపై ఇప్పటికే కొన్ని చర్చలు కూడా మొదలైనా సిద్దార్థ్ అంతగా ఆసక్తి చూపడం లేదని చెప్తున్నారు. మరి హీరోగా వస్తాడా.. లేక మరేదైనా బిజినెస్ ఉత్తమం అనుకోని అలా ఫిక్స్ అయిపోతాడా అన్నది చూడాలి మరి!

హీరోగా బ్రహ్మానందం మరో వారసుడు?