మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో.. మొత్తం కలిపి 12 మంది!

259

అన్ని రంగాల్లో మాదిరి సినీరంగంలో కూడా వారసుల తెరంగేట్రం కామన్ గా మారిపోయింది. ఇప్పటికే నందమూరి, అక్కినేని, దగ్గుబాటి, ఘట్టమనేని వంటి బడా కుటుంబాల నుండి హీరోలు వచ్చారు.. ఇంకా వస్తారు. అయితే.. ఈ కుటుంబాల కంటే మెగా ఫ్యామిలీలో మాత్రం ఈ వారసుల హవా జలపాతంలా సాగుతూనే ఉంది. మిగతా కుటుంబాలలో అడపా దడపా హీరోలు వస్తుంటే మెగా కుటుంబం నుండి మాత్రం డజన్ల కొద్దీ హీరోలు దిగిపోతున్నారు. ఈ కుటుంబానికి మూలం చిరంజీవి. అల్లు రామలింగయ్య అంతకు మించిన సీనియర్ నటుడే అయినా హీరోల లాంచింగ్ కి ఉపయోగపడుతుంది మాత్రం మెగాస్టార్ ఇమేజ్ మాత్రమే.

చిరుతో మొదలు నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, నిహారిక ఇలా ఇప్పటికి 11 మంది మన తెలుగు సినిమాలో నటులైపోయారు. ఇందులో కొందరు చిరు, అన్నదమ్ముల వారసులైతే మరికొందరు మేనల్లుళ్లు, అల్లుడు. ఇక బన్నీ, శిరీష్ చిరు భార్యకు మేనల్లుళ్లయితే.. ఇప్పుడు అల్లు అరవింద్ భార్యకు మేనల్లుడు కూడా హీరోగా వచ్చేస్తున్నాడు. ఆయన పేరే ముత్తంశెట్టి విరాన్. ‘బతుకు బస్టాండ్’ అనే సినిమాతో విరాన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ముత్తంశెట్టి కుటుంబం ఇప్పటికే బన్నీ పుష్ప సినిమాకు ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఉండగా ఇప్పుడు హీరో కూడా వచ్చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా జూన్ 11న సినిమాని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. అయితే.. ఇప్పుడు విరాన్ తో కలిపి మెగా హీరోలు 12 మంది అయ్యారు. ఇప్పటికే నిహారికా భర్త చైతన్య కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం ఉండగా పవన్-రేణు దేశాయ్ పిల్లలు కూడా ఏదోకరోజు వెండితెరమీదకి రావాల్సిన వాళ్ళే. మరి ఇప్పటికే డజను మందైన మెగా హీరోలు ఎన్ని డజన్ల మంది అవుతారో ఏమో మరి!

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో.. మొత్తం కలిపి 12 మంది!