మాన్సాస్ ట్రస్టులో మరో వివాదం

69

మాన్సాస్ ట్రస్టులో మరో వివాదం చెలరేగింది. ట్రస్టు ప్రధాన కార్యాలయాన్ని విశాఖ నగరానికి తరలించాలని చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి అనుమతి కోరుతూ ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ కు సంచయిత లేఖ రాశారు.. అయితే మాన్సాస్ ట్రస్ట్ విజయనగరంలోని ఉండాలని టీడీపీ నేతలు, అశోక్ గజపతిరాజు వర్గీయులు పట్టుబడుతున్నారు. దీనిపై ప్రభుత్వ స్పందన తెలియాల్సి ఉంది.