‘ఎఫ్3’లో మూడో హీరోపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి!

243

ఫ్రస్ట్రేషన్ కు ఫన్ జోడిస్తే ఎలా ఉంటుందో చూపించి మనసారా నవ్వించిన సినిమా ఎఫ్ 2. వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా కామెడీ టైమింగ్, తమన్నా, మెహరీన్ గ్లామర్ కలిసి ఈ సినిమాను విజయతీరాలకు చేర్చాయి. దర్శకుడు అనిల్ రావిపూడి నటీనటుల బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా పక్కా గ్రిప్ తో సినిమా తీయడం సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. అప్పుడు ఆ సినిమా సక్సెస్ తో సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే ఎఫ్ 3కి కావాల్సిన వర్క్ కూడా స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి ఆ మధ్య ఒక పోస్టర్ విడుదల చేసి సినిమా ఎలా ఉంటుందో జస్ట్ అలా చూపించాడు.

అయితే… ఎఫ్ 2లో ఇద్దరు హీరోలు కనుక ఎఫ్ 3లో ముగ్గురు హీరోలు ఉండనున్నారనే ఓ ప్రచారం మొదలైంది. వెంకీ, వరుణ్ లకు తోడు రవితేజ, గోపీచంద్ లలో ఒకరు కలవనున్నారని కథనాలు నడిచాయి. అయితే.. మూడో హీరోపై స్పందించిన దర్శకుడు అనిల్ మాత్రం అలాంటిదేం లేదని తేల్చేశాడు. అసలు మూడో హీరో ఆలోచనే తనకు లేదన్న అనిల్ ఎఫ్ 2 లో జోడీలే ఈ సినిమాలో కూడా ఉంటాయని చెప్పేశాడు. ఇద్దరు హీరోలున్న ఈ పార్టులో డబ్బు వల్ల ఫ్యామిలీలో ఎదురయ్యే సమస్యలను కామెడీ దట్టించి చెప్పనున్నట్లుగా తెలుస్తుంది.

‘ఎఫ్3’లో మూడో హీరోపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి!