వ్యాక్సిన్ తీసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త మృతి

128

దేశంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇప్పటికే సుమారు 60 లక్షల మందికి కరోనా టీకా ఇచ్చారు. టీకా తీసుకున్న వారిలోకి కొందరికి జ్వరంతోపాటు అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. కరోనా టీకా తీసుకున్న వారిలో కొందరు మృతి చెందారు. తాజాగా మరో మహిళ కరోనా టీకా తీసుకోని మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట మండలం, నందిపాడు అంగన్‌వాడీ కార్యకర్త నాగమణికి గత నెల 21న వ్యాక్సిన్ వేశారు.

అయితే టీకా తీసుకున్న మరుసటి రోజు నుంచి జ్వరం, వొళ్లునొప్పులు రావడంతో ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స అందించిన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆమె మృతిచెందింది. టీకా వికటించడంవల్లే నాగమణి మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే అదే రోజు 50 మంది అంగన్ వాడీ కార్యకర్తలకు టీకా ఇచ్చారు. వారంతా ఆరోగ్యాంగానే ఉన్నారు. నాగమణి మాత్రం అనారోగ్యానికి గురై మృతిచెందింది.

ఇక ఈమె మృతిపై డాక్టర్లు స్పందించారు. టీకా వలన ఆమె మృతి చెందలేదని తెలిపారు. ఇతర అనారోగ్య కారణాలతో నాగమణి మృతి చెందినట్లు వివరించారు.

వ్యాక్సిన్ తీసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త మృతి