Ap Panchayat elections : ఓటు వెయ్యకపోతే “కాళ్ళు విరగొడతా”

60

ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ సమరం పెద్ద పంచాయితీ తెచ్చిపెడుతుంది. ప్రశాంతంగా ఉండే పల్లెలు కక్షలు కార్పణ్యాలతో వణికిపోతున్నాయి.. చాలా గ్రామాల్లో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఢీ అంటే ఢీ అనే విధంగా ఉంది. కొన్ని చోట్ల నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకుంటున్నారు. మరికొన్ని చోట్ల బెదిరింపులకు దిగుతున్నారు. కొన్ని చోట్ల ప్రత్యేక్ష దాడులు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థికి ఓటు వెయ్యాలని లేకపోతే కాళ్ళు విరగ్గొడతా అంటూ గ్రామస్తులను బెదిరిస్తున్నట్లుగా ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఆడియో అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన వైకాపా నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిదిగా ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు..

ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ కు ట్యాగ్ చేస్తూ ట్విట్ చేశారు టీడీపీ నేత లోకేష్ గ్రామాల్లో @ysjagan రౌడి గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ధర్మవరం నియోజకవర్గం వైకాపా నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి ఎన్నికల్లో వైకాపాకి ఓటు వెయ్యకపోతే కాళ్ళు విరగ్గొడతా అంటూ గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. వైకాపా నాయకుల బెదిరింపులు పోలీసులుకు మాత్రం వినపడవు, కనపడవు.

మానవత్వాన్ని మరిచి మూర్ఖంగా ప్రవర్తించే ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే ధైర్యం పోలీస్ శాఖకు లేదా? అని లోకేష్ అన్నారు గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. వైకాపా నాయకుల బెదిరింపులు పోలీసులుకు మాత్రం వినపడవు, కనపడవు. మానవత్వాన్ని మరిచి మూర్ఖంగా ప్రవర్తించే ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే ధైర్యం పోలీస్ శాఖకు లేదా? అంటూ వరుస ట్విట్లు చేస్తూ ఓ వీడియో ను ట్యాగ్ చేశారు లోకేష్.. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Ap Panchayat elections : ఓటు వెయ్యకపోతే “కాళ్ళు విరగొడతా”