దూకుడుగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ.. ఏపీలో మునిసిపల్ ఎన్నికలు

98

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పంచాయితీ ఎన్నికలు పూర్తయిన వెంటనే మునిసిపాలిటీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎస్ఈసీ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఫిబ్రవరి 21తో ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పర్వం ముగుస్తుంది.

అనంతరం ఫిబ్రవరి 22న మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారని విశ్వస్వనియా వర్గాల నుంచి సమాచారం. ఇక పంచాయితీ ఎన్నికల మొదటివిడత నామినేషన్ ప్రక్రియ జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికలకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. విధుల్లో కేంద్ర సిబ్బందిని తీసుకునేందుకు నిమ్మగడ్డ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాశారు. ఇంకా ఈ లేఖపై వివరణ రానట్లుగా తెలుస్తుంది.

మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ భద్రతను పెంచారు. ఆయన కార్యాలయం వద్ద భద్రత పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కార్యాలయంలోకి వచ్చే వాహనాలను క్షున్నంగా తనిఖీ చేస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది. కాగా తనకు ప్రాణహాని ఉందంటూ నిమ్మగడ్డ గతంలో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే భద్రత పెంచినట్లు తెలుస్తుంది. మరోవైపు అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగే విధంగా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి తెలిపారు.

దూకుడుగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ.. ఏపీలో మునిసిపల్ ఎన్నికలు