Ap elections : ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ సంచలన నిర్ణయం

118

ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతేడాది జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు లింక్ పెడుతూ సీఎస్ కు లేఖ రాశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్బంగా రాష్ట్రంలో ఏకగ్రీవమైన మండలాల్లోని ఎంపీడీవోలను బదిలీ చెయ్యాలని ఆంధ్ర ప్రదేశ్ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. నిమ్మగడ్డ రాసిన లేఖ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇక ఈ లేఖపై సీఎస్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిననాటి నుంచి అధికారులను బదిలీ చేస్తూనే ఉన్నారు నిమ్మగడ్డ.. మొదట ఇద్దరు కలెక్టర్లను, ఓ ఎస్పీ, మరో తొమ్మిది మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించారు. ఆ తర్వాత పంచాయితీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లను కూడా బదిలీ చెయ్యాలని కోరారు. అయితే బదిలీ నిర్ణయాన్ని ఎస్ఈసీ వెనక్కు తీసుకున్నారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2021 ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించినా పట్టించుకోలేదని అందువల్ల వారిని అభిశంసించడంతోపాటు వీఆర్ఎస్ కు చర్యలు తీసుకోవాలంటూ డీవోపీటీకి కమిషనర్‌ లేఖ రాశారు. ఐతే వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిన నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏకగ్రీవ ఎన్నికలకు తాను వ్యతిరేకం కాదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. కానీ బలవంతంగా నామినేషన్లు వెయ్యనీయకుండా అడ్డుకొని ఏకగ్రీవం చేస్తే తప్పకుండ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఎన్నికలకు సంబందించిన యాప్ యూ ఆయన ఆవిష్కరించారు. ఎవరైనా ప్రలోబాలకు గురిచేసిన, దాడులకు దిగినా, మద్యం డబ్బు పంచుతున్నట్లుగా కనిపించినా వీడియో తీసి ఈ యాప్ లో పోస్ట్ చెయ్యాలని తెలిపారు. ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.

Ap elections : ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ సంచలన నిర్ణయం