ఏపీలో ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం :- ఎంపీ

141

ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నంగా ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. గురువారం పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు ఇచ్చే నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్ళిస్తుంది వ్యాఖ్యానించారు. రాష్ట్రము తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉందని, కనీసం ఉద్యుగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతుందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో లక్షా 46 వేల కోట్ల రూపాయల అప్పు చేసిందని అన్నారు. శాంతి భద్రతలు క్షిణించాయని, రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రాజెక్టును త్వరగా పూర్తి చెయ్యాలని కనకమేడల కోరారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ 70 శాతం పూర్తైందని,, మిగతా 30 శాతం పనులు పూర్తి చెయ్యాల్సిన భాద్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, కేంద్ర ప్రభుత్వమే చొరవతీసుకుని దీనిని నిర్మించాలని కోరారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుని నిధులివ్వడంతో పాటు, కాలపరిమితిలోగా పూర్తి చేయాలని ఏపీ ప్రజలు, రైతులు కోరుతున్నారు” అని కనకమేడల సభ దృష్టికి తెచ్చారు.

ఏపీలో ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం :- ఎంపీ