సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ ప్రారంభం

56

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ప్రారంభమైన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు. ఇందులో ముఖ్యంగా రెండో విడత ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి ఆమోదం తెలపనున్నారు మంత్రులు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక పాలసీ తోపాటు..

6 జిల్లాల్లో వాటర్‌షెడ్‌ల అభివృద్ధి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలపనున్నటు సమాచారం. ఈ అంశాల తోపాటు ఏపీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు, సర్వే అండ్‌ బౌండరీ చట్ట సవరణకు, రైతు భరోసా మరో విడత చెల్లింపులుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుందని సమాచారం.