Anchor Vishnupriya: సోషల్ మీడియాలో యాంకరమ్మ సెగలు!

344

Anchor Vishnupriya: సినిమా హీరోయిన్స్ అంతగా కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొడుతుంటే మేమేమన్నా తక్కువ తిన్నామా అని ఈ మధ్య కాలంలో బుల్లితెర బేబీలు కూడా తెగ రెచ్చిపోతున్నారు. అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ, శ్రీముఖి, భానుశ్రీ, నేహా చౌదరి, వింధ్య, మంజూష షో ఏదైనా వాళ్ళకి అవకాశం ఉన్నంతలో బుల్లి తెర ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అదంతా స్క్రీన్ వరకే పరిమితం. కానీ వీరిలో కొందరు ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ పెట్టేసి కురాళ్ళ గుండెల్ని గుల్లచేస్తున్నారని కంప్లైంట్స్.

https://www.instagram.com/p/CLJYU0Zh2v9/

అనసూయ, రష్మీ, శ్రీముఖి, విష్ణుప్రియ, భానుశ్రీ ఈ ఫోటో షూట్స్ హంగామా ఎక్కువగా చేస్తుంటారు. వీరికి బుల్లితెరతో పాటు వెండితెర మీద కూడా వెలిగిపోవాలని ఆశ. వీరంతా దాదాపుగా పలు సినిమాలలో మెరిసినా ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉన్నామని చెప్పేందుకు ఫోటో షూట్స్ పెడుతున్నారు. అందాల విందు అప్పనంగా వడ్డించే ఈ ఫోటోలు తెచ్చి సోషల్ మీడియాలో మంట పెడుతుంటారు. తాజాగా యాంకర్ విష్ణుప్రియ తన లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ ను ఇన్స్‌స్టా ఖాతాలో షేర్ చేసి సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది.

https://www.instagram.com/p/CLHbcNDh-dV/

కేవలం ఫోటోలే కాదు.. షూట్ కోసం తీసిన వీడియోను కూడా ఇనిస్టాలో పెట్టేసింది. బుల్లి నిక్కరు, వైట్ షర్ట్ ధరించిన విష్ణు.. షర్ట్ బటన్స్ విప్పేసి ఎద అందాలు చూపిస్తూ తెగ ఊరించేసింది. అయితే.. గ‌తంలో ఎన్న‌డు లేనంత‌గా విష్ణు ప్రియ ఇలా రెచ్చిపోవ‌డంపై నెటిజ‌న్స్ చెవులు కొరుక్కుంటున్నారు. అసలే ఈ యాంకరమ్మ రెచ్చిపోయి నటించిన ‘చెక్‌మేట్’ సినిమా కూడా విడుదలకు సిద్దమవుతుండగా ఇలా ముందే ఫోటో షూట్ తో ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తుందేమో అనిపిస్తుంది.

https://www.instagram.com/stories/highlights/17878090661140393/

Anchor Vishnupriya: సోషల్ మీడియాలో యాంకరమ్మ సెగలు!