వైఎస్ ష‌ర్మిల భ‌ర్త‌ను క‌లిసిన యాంక‌ర్ శ్యామ‌ల!

152

తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు, యాంకర్, పలు టీవీ కార్యక్రమాలను సైతం నిర్మిస్తున్న శ్యామల గత సాధారణ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకున్న శ్యామల అప్పటి ఎన్నికలలో అడపాదడపా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కానీ ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చినా శ్యామల ఎక్కడా కనిపించలేదు. కొద్ది నెలలుగా సైలెంట్ గా ఉన్న శ్యామల తాజాగా వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ను కలవడం ఆసక్తిగా మారింది. అది కూడా నిన్ననే షర్మిల రాజకీయాలలో తొలి అడుగుపడగా మరుసటి రోజే శ్యామల అనిల్ కుమార్ ను కలిశారు.

బుధవారం బ్రదర్ అనిల్ కుమార్ పుట్టినరోజు కావడంతో లోటస్ పాండ్ లో భారీగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భర్త నరసింహారెడ్డితో కలిసి స్వయంగా షర్మిల ఇంటికి వెళ్లిన శ్యామల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన శ్యామ‌ల‌.. హ్యాపీ బ‌ర్త్, ఫ్రెండ్లీ మీట్, బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ అన్న అని హ్యాష్ ట్యాగ్‌లు పెట్టారు. అయితే.. ప్రస్తుతం వైసీపీ నేతలెవరూ షర్మిలను కలిసే ఉద్దేశ్యంలో లేరు. పార్టీ హైకమాండ్ నుండి స్పష్టమైన ఆదేశాలు కూడా ఉన్నాయని టాక్. కానీ శ్యామల వైసీపీ నేత కావడంతో ఈ కలయిక సహజంగానే ఆసక్తిగా మారింది.

వైఎస్ ష‌ర్మిల భ‌ర్త‌ను క‌లిసిన యాంక‌ర్ శ్యామ‌ల!