#1Vooru Vaada – నెల్లూరు జిల్లాలో అంతుచిక్కని వ్యాధి.. ప్రాణాలు కోల్పోయిన మహిళ!

204

ఓవైపు ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కలకలం కొనసాగుతుండగానే.. నెల్లూరు జిల్లాలో కూడా
మరో అంతుచిక్కని వ్యాధి వెలుగుచూసింది. నెల్లూరు జిల్లా కలువాయి మండలం, వీరబోట్లపల్లిలో పొలంలో కూలి పనిచేస్తున్న 11 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో మహిళా కూలి ప్రాణాలు కోల్పోయారు. పొదలకూరు ఆసుపత్రిలో కూలీలకు చికిత్స అందుతోంది. వైద్య సిబ్బంది ఆ ప్రాంతంలోని వాటర్ , బ్లడ్ శాంపిల్స్ ను సేకరిస్తున్నారు. కాగా కొన్నిరోజుల క్రితం పశ్చిమబెంగాల్ నుంచి కూలీలు నెల్లూరుకు వలస వచ్చారు.