అమ్మబడి లబ్దిదారులకు శుభవార్త

136

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి లబ్దిదారులకు శుభవార్త చెప్పింది. అర్హులు డిసెంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇక ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన విశాఖమంత్రి ఆదిమూలం సురేష్ బాబు, పతాకానికి సంబందించిన అన్ని వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 16-19 వరకు లబ్దిదారుల ప్రాథమిక జాబితా విడుదల చేస్తామని తెలిపారు.

20-24 వరకు జాబితాలో తప్పుల సవరణకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 26 న అమ్మ ఒడి లబ్దిదారుల లిస్ట్ ఫైనల్ చేస్తారు. ఈనెల 31న జాబితాపై ఆయా జిల్లాల కలెక్టర్లు ఆమోదం తెలుపనున్నారు. ఇక జనవరి 9 తేదీన లబ్ధిదారుల అకౌంట్స్ లో డబ్బు జమ కానుంది. కాగా గత విద్యాసంవత్సరానికి 43 లక్షల 54 వేల 600 మంది లబ్దిదారులకు అమ్మఒడి వర్తింప చేశారు. వీరికోసం రూ. 6336 కోట్లు ఖర్చు చేశారు.

అమ్మబడి లబ్దిదారులకు శుభవార్త