ట్రంప్ ట్విట్టర్ పాస్ వర్డ్ ఇదే!

53

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ పాస్ వర్డ్ ను బయటపెట్టారు నెథర్లాండ్ కు చెందిన ఎథికల్ హ్యాకర్ విక్టర్ గెవెర్స్‌, ఆయన అకౌంట్ ఓపెన్ చేసి అమెరికా సెక్యూరిటీ విభాగానికి సవాల్ విసిరారు. కాగా maga2020! అనే పాస్ వర్డ్ ను ట్రంప్ తన ట్విట్టర్ పాస్ వర్డ్ గా పెట్టుకున్నారు. maga అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అర్ధం..

ఇది రిపబ్లిక్ పార్టీ ఎన్నికల స్లోగన్, ఇంత నార్మల్ పాస్ వర్డ్ పెట్టుకోవడం వలన ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడి ట్విట్టర్ కు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. కాగా ఎథికల్ హ్యాకర్ విక్టర్ గెవెర్స్ పై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన నెథర్లాండ్ కోర్టు. తమ దేశంలో ఎథికల్ హ్యాకర్స్ కి శిక్షలు వేయమని తెలిపింది. వారు ఎటువంటి అక్రమాలకు పాల్పడరని పేర్కొంది.

ఇక దీనిపై విక్టర్ గెవెర్స్ మాట్లాడుతూ.. కేవలం అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీని సవాల్ చేసేందుకే తాను ఈ పని చేశానని చెప్పాడు. కాగా నెథర్లాండ్ కు చెందిన ఈ హ్యాకర్ ప్రపంచంలోని చాలామంది ట్విట్టర్ అకౌంట్స్ ను హ్యాక్ చేశాడు. రక్షణ శాఖకు సంబందించిన అకౌంట్స్ ని కూడా హ్యాక్ చేశాడు. కానీ దానిలోని సమాచారాన్ని మాత్రం దొంగిలించట. కేవలం సవాళ్లు విసరడమే పనిగా పెట్టుకున్నారంట విక్టర్ గెవెర్స్ కి

ట్రంప్ ట్విట్టర్ పాస్ వర్డ్ ఇదే!