చంపాలని వచ్చి చచ్చాడు..

92

క్రిస్మస్ పర్వదినం రోజు అమెరికాలో భారీ పేలుడు జరిగిన విషయం విదితమే. అయితే ఈ పేలుడులోనే దుండగుడు మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. 63 ఏళ్ల ఆంటోని వార్నర్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పేలుడు జరిగిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిఉన్న మానవ మాంసపు ముద్దలు అతడివే అని ఫోరెన్సిక్ పరీక్షల్లో వెల్లడైంది. టెన్నెస్సీ రాష్ట్రం నాన్ విల్లేలోని డౌన్ టౌన్ లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బాబ్ పేల్చుకోవడం వెనక ఆంటోని ఉద్దేశం ఏంటనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

విచారణలో భాగంగా కుటుంబ సభ్యులను, సన్నిహితులను విచారిస్తున్నారు. భారీ రద్దీ ఉండే ప్రాంతంలో ఈ పేలుడు జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆంటోనిని అక్కడ ఎవరైనా వదిలి వెళ్ళారా అనే అనుమానాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. 63 ఏళ్ల ఆంటోనికి ఇటువంటి దుశ్చర్యకు పాల్పడాలి అనే ఆలోచన ఎలా వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇతరుల ప్రోద్బలంతో ఇలా చేసి ఉంటారని ఓ అంచనాకు వచ్చారు. కాగా ప్రమాదం జరిగిన ప్రాంతం ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఇక్కడ బార్లు రెస్టారెంట్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రమాదం ఉదయం జరగడంతో ప్రాణనష్టం జరగలేదు. పదిగంటల తర్వాత జరిగి ఉంటే భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగేది.