అమీర్ పేటలో ఘోరప్రమాదం

76

అతి వేగంతో ఓ యువకుడు ప్రాణం కోల్పోగా, మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ అమీర్ పేటలో జరిగింది. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై కూకట్ పల్లి వైపు వెళ్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబెడ్కర్ చౌరస్తా వద్దకు రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో ఓ యువకుడి తల మెట్రో స్టేషన్ రైలింగ్ లో ఇరుక్కుపోయింది. దింతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

అమీర్ పేటలో ఘోరప్రమాదం