అమెజాన్ సీఈఓ పదవినుంచి తప్పుకోనున్న జెఫ్ బెజోస్

1516

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఈ మేరకు ఉద్యోగులకు లేఖలు కూడా రాసారాయన.. తన స్థానంలో ఆండీ జెస్సీ కొత్త సీఈఓగా నియమితులవుతారని వెల్లడించారు. బెజోస్ ప్రస్తుతం అమెజాన్ బోర్డు యాక్టింగ్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

కాగా జెస్సీ ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్ చీఫ్ గా ఉన్నారు.. జెస్సీ 1997 లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసి అమెజాన్‌లో మార్కెటింగ్ వృత్తిని ప్రారంభించాడు. 2003 లో AWS అనే క్లౌడ్ సేవా సంస్థను డెవలప్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ విభాగం అమెజాన్ సంస్థలో అత్యంత లాభదాయక విభాగంగా ఉంది. ఇదిలావుంటే అమెజాన్ మార్కెట్ విలువ మంగళవారం 69 1.69 ట్రిలియన్లు. ఇది 10 సంవత్సరాల క్రితంతో పోలిస్తే 10 రెట్లు పెరిగింది.