సీఎం సలహాదారుడిగా పీకే

192

దేశంలో మంచి పాపులారిటీ వ్యూహరచన ఉన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరో బాధ్యత తీసుకున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ కాంగ్రెస్ తరపున వ్యూహాలు రచించిన కిషోర్ మళ్ళి 2022లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా పనిచేయనున్నారు. ఈ విషయాన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. కిషోర్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పనిచేసి అఖండ విజయం అందించారు. ఇక ఈ ఎన్నికల్లో కూడా పంజాబ్ లో కాంగ్రెస్ విజయం నల్లేరుమీద నడకే అని విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు కిషోర్ బెంగాల్ లో మమతా సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో పంజాబ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు వ్యూహకర్తగా ప్రశాంత్ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రశాంత్ చేసిన ట్విట్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. బెంగాల్ లో బీజేపీ రెండంకెల సీట్లు కూడా సాధించలేదని ప్రశాంత్ ట్విట్ చేశాడు. ఈ ట్విట్ గతేడాది డిసెంబర్ లో చేయగా దానికి కట్టుబడి ఉన్నానని సోమవారం గుర్తు చేస్తూ మరో ట్వీట్ చేశారు.

అయితే బెంగాల్ లో పరిస్థితి మాత్రం మరోవిదంగా ఉంది. ఇక్కడ బీజేపీ అధికారం చేపడుతుందని సర్వేలు చెబుతున్నాయి. కానీ ప్రశాంత్ మాత్రం రెండంకెల సంఖ్య దాటడని శబదం చేసి చెబుతున్నారు. తృణమూల్ లో హేమాహేమీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో మమత ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నారు. ప్రజలు కూడా మమతా పాలనపై విసుగు చెందినట్లుగా సర్వేల్లో తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏ వ్యూహంతో ప్రశాంత్ బీజేపీని కట్టడి చెయ్యగలడు అని అందరు చర్చించుకుంటున్నారు.

సీఎం సలహాదారుడిగా పీకే