Amanchi Krishnamohan: వైసీపీ నేతను రెండు గంటలపాటు సీబీఐ విచారణ!

367

Amanchi Krishnamohan: విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయంలో అధికారులు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ ను సుమారు రెండు గంటలపాటు విచారించారు. ఆమంచి గతంలో కోర్టులు, న్యాయవ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మత్తు డాక్టర్, ప్రభుత్వం మధ్య వివాదం గురించి తెలుగు ప్రజలకు అందరికీ తెలిసిందే. కరోనా సమయంలో మాస్కులు ఇవ్వకుండా వైద్యం చేయమన్నారని డాక్టర్ సుధాకర్ ఆరోపణలు చేయడం.. అనంతరం పోలీసులు డాక్టరును రోడ్డుపైనే అర్ధనగ్నంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేయడం తీవ్ర వివాదం రేపింది.

డాక్టర్ సుధాకర్ కేసులో న్యాయస్థానాలు తీవ్రంగా స్పందించాయి. దళిత డాక్టర్ కావడంతో దళిత సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ఈ కేసులో హైకోర్టు ఏకంగా సీబీఐ దర్యాప్తుకి ఆదేశించి షాక్ కు గురిచేసింది. ఆ సమయంలో వైసీపీ నేత ఆమంచి కోర్టులు, జడ్జీల మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమంచి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఆ కేసులో ఆమంచి నేడు విశాఖ సీబీఐ కార్యాలయంలో విచారణను ఎదుర్కొన్నారు. సుమారు రెండు గంటల పాటు ఈ విచారణ సాగింది.

న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులపై ఎందుకు దురుద్దేశంతో వ్యాఖ్యలు చేశారని అధికారులు ప్రశ్నించారు. ఏ దురుద్దేశ్యంతో తానా వ్యాఖ్యలు చేయలేదని ఆమంచి సమాధానం చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోను సీబీఐకి అందజేశానని ఆమంచి మీడియాకి చెప్పారు. డ్రింక్ చేసిన ఒక డాక్టర్ సీఎంపై కామెంట్స్ చేయడం బాధ కలిగిందని.. సాధారణ కేసును సిబిఐకి అప్పగించడాన్ని ప్రజలు విస్తుపోయారని.. బాధతోనే అలా మాట్లానని విచారణ చెప్పినట్లుగా ఆమంచి మీడియాకు వివరించారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని.. చాలాసందర్భాల్లో కోర్టులలోనే తనకు న్యాయం జరిగిందని ఆమంచి సీబీఐ అధికారులకు వివరించినట్లుగా చెప్పారు.

Amanchi Krishnamohan: వైసీపీ నేతను రెండు గంటలపాటు సీబీఐ విచారణ!