Adipurush: ప్రభాస్ తల్లిగా అలనాటి అందాల తార!

243

Adipurush: బాహుబలి సినిమా ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసిన సంగతి తెలిసిందే. అందుకే ప్రస్తుతం ప్రభాస్ తో ఏ సినిమా చేసినా అదే లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యాం బిజీలో ఉండగానే కేజీఎఫ్ తో క్రేజీ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ తో మరో సినిమాకు ముహూర్తం పెట్టేశాడు. అంతకు ముందే ఆదిపురుష్ కూడా లైన్ లో పెట్టేశాడు. ఈ సినిమాలన్నీ ఇండియా లెవెల్ సినిమాలే కాగా అన్నిట్లో ఇతర బాషల నటులు ఉండేలా చూస్తున్నారు. ఆది పురుష్ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించ‌నుండగా ప్రభాస్‌తో మరో సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేశ్ గా, సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టిస్తోందని సమాచారం.

ఇప్పుడు అదే వరసలో ఆదిపురుష్ లో ప్రభాస్ త‌ల్లి కౌశ‌ల్య పాత్ర‌లో హేమమాలి‌ని క‌నిపించ‌నుంద‌ని టాక్ నడుస్తోంది. హేమామాలిని తెలుగు నుండి హిందీ వరకు బిగ్ స్టార్. సో అలా కూడా సినిమాకి సూపర్ క్రేజ్ దక్కుతుంది. ఇక ఇటీవల ఈ సినిమా మోషన్ క్యాప్చర్ మొదలైందని దర్శకుడు ఓం రౌత్ ప్రకటించగా.. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించిన ప్రభాస్ దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఈరోజు మోషన్ క్యాప్చర్ మొదలవగా.. ఫిబ్రవరి 2న ముహూర్తం అని చెప్పుకొచ్చాడు.