‘ఆర్ఆర్ఆర్’ కి అలియా గానం !

559

మెగా, నందమూరి అభిమానులను ఎప్పుడెప్పుడా అని వేచిచూసేలా చేస్తున్న భారీ ప్రాజెక్ట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కొమరంభీం పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. ఇద్దరు టాప్ హీరోలు కావడంతో ఇది ఇండస్ట్రీలో హిస్టరీ క్రీయేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ క్రమంలో రాజమౌళి కోరికపై ‘ఆర్ఆర్ఆర్’ కి అలియా ఓ పాట పాడుతున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఆమెపైనే చిత్రీకరించే పాటను అలియా పాడనున్నారని తెలుస్తుంది. అయితే హిందీలో మాత్రమే ఈ పాటను అలియా ఆలపిస్తుందట. అలియా మంచి సింగర్ అన్న విషయం తెలిసిందే. . గతంలో ఆమె ‘హైవే’, ‘హంటీ శర్మా కీ దుల్హనియా’ వంటి సినిమాలో పాటలు పాడి సింగర్ గా కూడా అలరించారు.

‘ఆర్ఆర్ఆర్’ కి అలియా గానం !