ప్రపంచ కుబేరుడు మిస్సింగ్.. చైనా కుట్ర చేసిందా?

1354

గతేడాది అక్టోబర్ లో వివాదాస్పద ప్రసంగం తరువాత ప్రపంచ కుబేరుడు, అలీబాబా వ్యవస్థాపకుడు ‘జాక్ మా’ గత రెండు నెలలుగా తప్పిపోయినట్లు వార్తలు వస్తున్నాయి, గత అక్టోబర్ నెలలో చైనా నియంత్రణ వ్యవస్థపై జాక్ మా తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా.. బ్యాంకులను పాన్ షాప్స్ అంటూ సంబోధించారు.. ఇది జరిగిన కొద్దిరోజులకే ఆయన కనిపించకుండా పోయారు.

జాక్ మా నవంబర్ 2019 నుండి బాహ్యప్రపంచానికి కనిపించడం లేదు.. తన సొంత టాలెంట్ షో అయిన బిజినెస్ హీరోస్ చివరి ఎపిసోడ్లో కూడా కనిపించలేదు. దాంతో ప్రపంచవ్యాప్తంగా పలు మీడియా సంస్థలు ఆయనపై కథనాలు రాస్తున్నాయి.. అయితే చైనాలో ఉన్న మీడియా నియంత్రణ నేపథ్యంలో ఈ వార్తను మీడియా పెద్దగా హైలైట్ చెయ్యలేదు.

మరోవైపు ప్రపంచ దేశాలు మాత్రం జాక్ మా ఆచూకీపై చైనా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. అయితే చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం మాత్రం జాక్ మా సమాచారంపై ఎటువంటి ప్రకటనా చెయ్యకపోవడం అనుమానాలకు తావిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంపై జాక్ మా విమర్శలు చేశారు కనుక ప్రభుత్వమే జాకా మా ను ఏమైనా చేసి ఉండొచ్చన్న అనుమానాలు వెలియబుచ్చుతున్నారు.