రెండేళ్ల తర్వాత తెరపైకి అక్షయ గోల్డ్ కుంభకోణం

153

2019లో విచారణకు దూరమైనా అక్షయ గోల్డ్ కుంభకోణం తిరిగి బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది. బాధితుల తరపు న్యాయవాది అర్జున్ కుమార్ టీఎస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు మెన్షన్ చేశారు. సుమారు రెండేళ్లుగా ఈ కేసు విచారణకు కూడా రావడం లేదని తెలిపారు. జస్టిస్ రామసుబ్రమణ్యం బదిలీ తర్వాత కేసు విచారణకు నోచుకోలేదని ప్రధాన న్యాయమూర్తికి అర్జున్ కుమార్ వివరించారు.

కోర్టు ద్వారా గతంలో ఆక్షన్ జరిగిన విషయం, కోర్టు ఖాతాలో డబ్బులు దాదాపు పది కోట్లు ఉన్నాయని అర్జున్ కుమార్ వివరించారు. ఇక దీనిపై ఆమె స్పందించారు. కోర్టు ఖాతాలో ఉన్న డబ్బు పంపిణీకి ఏమైనా చర్యలు తీసుకున్నారా అని చీఫ్ జస్టిస్ హిమా కొహ్లీ ప్రశ్నించారు. ఎంత మంది బాధితులు పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అడిగారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం, కంపెనీ తరుఫున న్యాయవాదులతో కలిసి మళ్లీ మెన్షన్ చెయ్యాలని చీఫ్ జస్టిస్ హిమా కొహ్లీ అక్షయ గోల్డ్ బాధితుల తరుఫు న్యాయవాది అర్జున్ కుమార్ కు సూచించారు.

రెండేళ్ల తర్వాత తెరపైకి అక్షయ గోల్డ్ కుంభకోణం