అయోధ్య రామయ్య గుడి నిర్మాణానికి అక్షయ్ కుమార్ విరాళం

166

అయోధ్య రామమందిర నిధి సేకరణ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. రామజన్మభూమి తీర్ధ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిధి సేకరణ జరుగుతుంది. ఈ నిధి సేకరణలో హిందూ సంఘాల సభ్యులు పాల్గొంటున్నారు. ఇక జనవరి 20 నుంచి ఇంటింటికి వెళ్లి నిధి సేకరించనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రముఖులు దేవాలయ నిర్మాణానికి తమకు తోచినంత సాయం చేస్తున్నారు.

దేవాలయ నిర్మాణానికి సాయం చేసేవిషయంలో సినీ ప్రముఖులు ముందువరుసలో ఉన్నారు. ప్రణీత తనవంతు సాయంగా లక్ష రూపాయల విరాళం అందించింది. తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా విరాళం అందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దేశ ప్రజలందరు ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని, ఇందుకు బాధ్యతగా ప్రతి ఒక్కరు విరాళాలు అందించాలని అక్షయ్ కోరారు.

కాగా గతేడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోదీ అయోధ్య రామమందిరానికి స్వయంగా భూమిపూజ చేయగా, ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధ్బుతంగా రామమందరం నిర్మాణం ప్లాన్ చేస్తుండగా, ట్రస్ట్‌కు భారీగానే విరాళాలు వస్తున్నాయి. ఒకే రోజు 100 కోట్ల విరాళాలు అందినట్లు రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది.

అయోధ్య రామయ్య గుడి నిర్మాణానికి అక్షయ్ కుమార్ విరాళం