బోయినపల్లి పోలీసుల ఎదుట అఖిలప్రియ.. మళ్ళీ గంటన్నర విచారణ!

148

రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంకా విచారణ ఎదుర్కుంటున్నారు. ప్రధాన నిందితులలో ఒకరైన అఖిలప్రియ నేడు మరోసారి బోయినపల్లి పోలీస్ స్టేషనుకు హాజరయ్యారు. ప్రతి 15 రోజులకోసారి పోలీస్ స్టేషనుకు హాజరై సంతకం చేయాలని సికింద్రాబాద్ కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం పది గంటలకు బోయిన్పల్లి స్టేషనుకు వెళ్లిన అఖిలప్రియ.. సికింద్రాబాద్ కోర్టు ఆదేశానుసారం ఏసీపీ నరేశ్ రెడ్డి సమక్షంలో సంతకం చేయగా.. గంటన్నరపాటు అక్కడే ఉండి విచారణకు సహకరించారు. ఈ కేసు విచారణలో భాగంగా అఖిలప్రియను పోలీసులు పలు ప్రశ్నలు అడిగారు. తమ విచారణకు ఆమె సహకరించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు భార్గవ్ రామ్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఏసీపీ నరేశ్ రెడ్డి తెలిపారు.

బోయినపల్లి పోలీసుల ఎదుట అఖిలప్రియ.. మళ్ళీ గంటన్నర విచారణ!