Akhil Akkineni: నాగార్జున పంతం ఈసారైనా నెరవేరేనా?

725

Akhil Akkineni: అఖిల్ అందగాడు.. ఈవిషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మంచి లవ్ స్టోరీ పడితే తెలుగు ఇండస్ట్రీ హీరోలలో మహేష్ బాబు తర్వాత అమ్మాయిలలో అఖిల్ ఫాలోయింగ్ తెచ్చుకోవడంలో కూడా ఎలాంటి డౌట్స్ లేవు. కానీ లేనిదంతా సక్సెస్. అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా తెరంగేట్రం చేసిన అఖిల్ ఇప్పటికి మూడు సినిమాలు చేసినా ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్ సినిమాలు చేసిన నాగార్జున అఖిల్ విజయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎందుకో అఖిల్ మాత్రం వెనకబడిపోతూనే ఉన్నాడు.

అఖిల్ ఇప్పటికి మూడు సినిమాలు చేసినా బ్లాక్ బస్టర్ అన్న పదం మాత్రం దక్కనేలేదు. అందుకే అఖిల్ తండ్రి మన్మధుడు నాగ్ ఈసారి ఎలాగైనా అఖిల్ కు హిట్ ఇవ్వాలని పంతంతో ఉన్నాడు. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. బొమ్మరిల్లు సినిమా అప్పట్లో ఒకఊపు ఊపిన సినిమా. కానీ దర్శకుడు భాస్కర్ కు మళ్ళీ ఆ స్థాయిలో సక్సెస్ దక్కలేదు. అందుకే అతను కూడా బ్యాచిలర్ కోసం కసితో పనిచేస్తున్నాడు.

ఇదిలా ఉండగానే నాగ్ అఖిల్ కోసం తర్వాత కథల ఎంపికలో బిజీగా ఉన్నాడట. బ్యాచిలర్ సినిమా ఎలా ఉన్నా ఈసారి పక్కా అఖిల్ కెరీర్ మలుపు తిప్పే సినిమా పడాలని పంతంతో సెర్చ్ లో ఉన్నాడట. బ్యాచిలర్ సినిమా సక్సెస్ అయితే తర్వాత మరో భారీ హిట్ కొట్టి అఖిల్ కెరీర్ ను సెట్ చేయాలని టాలీవుడ్ మొత్తాన్ని జల్లెడ పడుతున్నాడట. బ్యాచిలర్ సినిమా తర్వాత అఖిల్ స్టైలిష్ దర్శకుడిగా పేరున్న సురేందర్ రెడ్డితో మాంచి రేసింగ్ కాన్సెప్ట్ కథతో కూడిన కామెడీ సినిమా చేయనున్నట్లు తెలుస్తుండగా ఆ సినిమా తర్వాత కూడా స్టఫ్ ఉన్న దర్శకుల చేతిలో పెట్టేందుకు నాగ్ ముమ్మర వేటలో ఉన్నాడట. మరి ఈసారైనా నాగ్ పంతం నెగ్గి అఖిల్ ఖాతాలో బంపర్ హిట్స్ పడతాయా అన్నది వేచిచూడాల్సిందే!

Akhil Akkineni: నాగార్జున పంతం ఈసారైనా నెరవేరేనా?